సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (11:55 IST)

లేస్ ప్యాకెట్లలో ఇక అప్పడాలు కూడా వచ్చేస్తున్నాయి..

అమెరికాలో కూల్‌డ్రింక్స్, చిప్స్ వంటివి తయారు చేసి భారీ కస్టమర్లను చూరగొన్న పెప్సికో సంస్థ.. భారత్‌లో అప్పడాలను అమ్మేందుకు సిద్ధమైంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణ భారత దేశ రాష్ట్రాల్లో... వరిబియ్యంతో కూడిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకునే వారిని లక్ష్యంగా చేసుకుని అప్పడాలను అమ్మేందుకు సిద్ధమని ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా అన్నం తీసుకునే వారికి అప్పడాలను అమ్మడం ద్వారా మంచి పేరు సంపాదించవచ్చునని పెప్సికో భావిస్తోంది. ఇలా దక్షిణ భారత దేశంలో అధికంగా ఇష్టపడి తినే అప్పడాలను అమ్మాలని పెప్సికో నిర్ణయించింది. ఈ మేరకు లేస్ బ్రాండ్‌‍ పేరిట అప్పడాలను తీసుకురానుంది. స్నాక్స్ తయారీలో హల్డిరామ్స్‌కు తదుపరి స్థానంలో వున్న పెప్సికో త్వరలో అప్పడాల మార్కెట్లోకి కూడా రానుంది.