1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (12:23 IST)

వరల్డ్ బ్యాంక్ అధ్యక్ష పదవి రేసులో ఇంద్రానూయి

ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవి రేసులో పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానూయి పేరు తెరపైకి వచ్చింది. ఆమె పేరును అగ్రరాజ్యం అమెరికా ప్రతిపాదించడం గమనార్హం. దీంతో ఆ పదవిలో ఆమె ముందు వరుసలో ఉన్నారు. 
 
ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షరాలిగా ఇంద్రానూయిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ నామినేట్‌ చేసినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్‌ ప్రస్తుత అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 
 
ఫిబ్రవరి 1న ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. 12 ఏళ్లు పెప్సీకో సీఈఓగా పనిచేసిన ఇంద్రనూయి.. గత ఆగస్టులో పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ప్రపంచ బ్యాంక్‌లో అమెరికా అతిపెద్ద భాగస్వామి అయినందున ఆ దేశం సూచించిన వ్యక్తికే పదవి దక్కే అవకాశం ఉంది.