శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 జనవరి 2019 (14:21 IST)

టీవీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్... రూ.153కే వంద చానెళ్లు

బుల్లితెర ప్రేక్షకులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శుభవార్త చెప్పింది. కేవలం 153కే వంద చానెళ్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ట్రాయ్ నిర్ణయం మేరకు 100 చానెళ్లు (ఫ్రీ లేదా పే) లేదా ప్రేక్షకులు కోరుకున్న 100 చానెళ్లను అందించాలని స్పష్టం చేసింది. 
 
ఈ విధానాన్ని వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అందించాలని ఆదేశాలు జారీచేసింది. కేబుల్ కనెక్షన్ లేదా డీటీహెచ్ కనెక్షన్ అయినా సరే వంద చానెళ్ళ వరకు ఇదే ధరకు అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టంచేసింది. 
 
ఇందుకోసం జనవరి 31వ తేదీలోపు తమతమ సర్వీస్ ప్రొవైడర్లు, ఆపరేటర్లను టీవీ ప్రేక్షకులు సంప్రదించాలని సూచనచేసింది. అంతేకాకుండా ఏదేని సందేహాలు ఉన్నట్టయితే 011-23237922 అనే ఫోన్ నంబరులో సంప్రదించాలని ట్రాయ్ అధికారులు కోరారు.