మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (11:10 IST)

పెట్రోల్‌పై దొంగదెబ్బ... 16వ రోజు పెరిగిన ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలపై చమురు కంపెనీలు దొంగదెబ్బ కొడుతున్నాయి. వీటి ధరలు వరుసగా 16వ రోజు కూడా పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోలుపై 33 పైసలు, డీజిల్‌పై లీటరుకు 58 పైసలు చొప్పున పెరిగాయి. ఫలితంగా 16 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.9.21 , డీజిల్‌పై రూ.8.55 పెరగడం గమనార్హం.
 
ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.79.56కి, డీజిల్ ధర రూ.78.85కి చేరింది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.81.27, డీజిల్ ధర రూ.74.14 గా ఉంది. 
 
ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.86.36, డీజిల్ ధర రూ.77.24గా ఉండగా, చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.82.87, డీజిల్ ధర రూ.76.30గా ఉంది. రాష్ట్రాల పన్ను విధింపును బట్టి ఆయా రాష్ట్రాల్లో ధరల్లో తేడాలు ఉంటాయి.