మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (10:37 IST)

దేశంలో కరెన్సీ కొరత... విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు

దేశవ్యాప్తంగా ఏర్పడిన కరెన్సీ కొరతతో భారతీయ రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. ఇందుకోసం ఏటీఎంలలోనే కాకుండా, బ్యాంకు కౌంటర్ల ద్వారా విత్‌డ్రా చేసుకునే మొత్తంపై కూడా పరిమితి విధించే దిశగా అడుగులు వేస్తున

దేశవ్యాప్తంగా ఏర్పడిన కరెన్సీ కొరతతో భారతీయ రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. ఇందుకోసం ఏటీఎంలలోనే కాకుండా, బ్యాంకు కౌంటర్ల ద్వారా విత్‌డ్రా చేసుకునే మొత్తంపై కూడా పరిమితి విధించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
 
ఇందులోభాగంగా, కౌంటర్ ద్వారా రూ.1000 కంటే మించి ఖాతాదారులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని ముంబైకి చెందిన సిటీ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌కు ఆదేశాలు జారీచేసింది. వీటిని మరిన్ని బ్యాంకులకు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సేవింగ్‌, కరెంట్‌, ఏ తరహా అకౌంట్‌ అయినా సరే రూ.1000కి మించి ఇవ్వొద్దు.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆదేశాలు పాటించాలి అని ఆదేశాల కాపీలో బ్యాంక్‌‌కు ఆర్బీఐ స్పష్టం చేసింది.
 
అలాగే రుణాలు, అడ్వాన్స్‌ విషయంలో కూడా ఆర్బీఐ నుంచి అనుమతి లేనిదే చెల్లించొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితులు తాత్కాలికమేనని.. త్వరలో సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆర్బీఐ అధికారి ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్.బి.ఐ. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(POS) మిషన్ల ద్వారా రోజుకు రూ.2 వేల వరకు నగదును కస్టమర్లు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది.