మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (19:50 IST)

పది రూపాయల నాణేలు రద్దు.. కర్ణాటకలో పుకార్లు.. బ్యాంకులకు పరుగులు

పెద్ద నోట్ల రద్దుతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు మరో వార్త షాక్‌ను ఇచ్చింది. పది రూపాయల నాణేలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందంటూ కర్ణాటకలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్రం రూ.10 నాణేలను న

పెద్ద నోట్ల రద్దుతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు మరో వార్త షాక్‌ను ఇచ్చింది. పది రూపాయల నాణేలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుందంటూ కర్ణాటకలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేంద్రం రూ.10 నాణేలను నిషేధించిందని, ఇక అవి చెల్లుబాటు కావంటూ ప్రచారం సాగుతోంది.

ఈ మేరకు ఆర్బీఐ ప్రకటించిదని కూడా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ప్రజలు, వ్యాపారులు బ్యాంకులకు పరుగులు తీశారు. కానీ పది రూపాయల నాణేలను రద్దు చేయలేదని బ్యాంకులు స్పష్టం చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
మార్కెట్లోకి నకిలీ నాణేలు పెద్ద ఎత్తున ప్రవేశించడంతో వాటిని అరికట్టేందుకు ఆర్బీఐ రద్దు చేసిందని వార్తలు రాగానే, వాటిని తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరించారు. దీంతో తమ వద్ద ఉన్న పది నాణేలను మార్చుకునేందుకు అందరూ బ్యాంకులకు పరుగులు తీశారు. కానీ ఆర్బీఐ పది రూపాయల నాణేలు రద్దు కాలేదని వివరణ ఇవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.