గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (15:17 IST)

చైనా దిగుమతులపై భారీగా సుంకాలు పెంపు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంతపని చేశారు. తన హెచ్చరికలను కాలరాసి ఇరాన్ నుంచి చైనా చమురును దిగుమతి చేస్తోంది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆంక్షలను బేఖాతర్ చేసిన పక్షంలో భారీ మొత్తంలో సుంకాలు వసూలు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు. ఆ విధంగానే ఆయన హెచ్చరించారు. 
 
చైనా దిగుమతులపై సుంకాలను 200 బిలియన్ డాలర్ల మేర పెంచారు. పలు వస్తువులపై 10 నుంచి 25 శాతం వరకు సుంకాలను పెంచేశారు. ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం పట్ల చైనా అదే స్థాయిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి సుంకాల పెంపు సరైన చర్య కాదని తెలిపింది. 
 
అమెరికా తీరు చైనాకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని చెప్పింది. తన నిర్ణయాన్ని అమెరికా పున:సమీక్షించుకోవాలని... లేని పక్షంలో తాము కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామని తెలిపింది. అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతుందని, ప్రపంచ వృద్ధి రేటు కుదుపుకు గురవుతుందని చైనా ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.