శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2016 (16:43 IST)

ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉర్జిత్ పటేల్

భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఉర్జిత్ ఆర్.పటేల్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ గవర్నర్‌గా తనదైన శైలిలో రాణించిన ప్రముఖ ఆర్థికవేత్త రఘురాం రాజన్ ఆదివారం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆ

భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఉర్జిత్ ఆర్.పటేల్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ గవర్నర్‌గా తనదైన శైలిలో రాణించిన ప్రముఖ ఆర్థికవేత్త రఘురాం రాజన్ ఆదివారం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పనిచేసిన ఉర్జిత్ పటేల్‌ను ఆర్బీఐకి కొత్త గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. 
 
సుదీర్ఘ కసరత్తు చేసిన కేంద్రం పలువురు ఆర్థిక వేత్తల పేర్లను పరిశీలించి చివరకు ఉర్జిత్ పటేల్ వైపే మొగ్గు చూపింది. రఘురాం రాజన్‌తో అత్యంత సన్నిహితంగా మెలగిన ఉర్జిత్... భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
 
2013 జనవరి నుంచి డిప్యూటీ గవర్నర్‌ సేవలందించిన ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ 24వ గవర్నర్‌‌గా‌ బాధ్యతలు చేపట్టారని, ఈనెల 4 నుంచి ఆయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఆ ప్రకటన పేర్కొంది. 
 
రాజన్ స్థానంలో డాక్టర్ ఉర్జిత్ పటేల్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆగస్టు 20న ఆమోదించింది. కాగా, ఈనెల 4వ తేదీ ఆదివారం కావడం, సోమవారం వినాయకచవితి పండుగ సెలవు ఉండటంతో డాక్టర్ పటేల్ మంగళవారంనాడు పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.