గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (14:49 IST)

ఏపీ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ఏపీ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గత నెల మార్చి 17వ తేదీన ఈ ఎగ్జామ్ జరగగా, 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. 
 
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ నోటిఫికేషన్‌లో భాగంగా… మొత్తం 81 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది ఏపీపీఎస్సీ. 
 
సెప్టెంబర్ మాసంలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. https://psc.ap.gov.in/ వెబ్ సైట్‌లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని కమిషన్ సూచించింది. 
 
ఆన్‌లైన్ ద్వారా మూడు రోజుల పాటు మార్చి 19 నుంచి మార్చి 21 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. ఆ తర్వాత ఫైనల్ కీతో పాటు ఫలితాలను ప్రకటించింది.