Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇంజనీరింగ్ డిగ్రీలు రద్దు... సుప్రీంకోర్టు షాక్

శనివారం, 4 నవంబరు 2017 (13:12 IST)

Widgets Magazine
supreme court

దేశంలో నాలుగు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలకు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ వర్శిటీలు నిర్వహిస్తున్న కరెస్పాండెన్స్‌ కోర్సు ద్వారా ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థుల ఇంజనీరింగ్‌ డిగ్రీలను రద్దుచేసింది. వీటిలో జేఆర్‌ఎన్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (రాజస్థాన్‌), అలహాబాద్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, వినాయక మిషన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ (తమిళనాడు) 2001 నుంచి కరెస్పాండెన్స్‌ కోర్సు ద్వారా ప్రదానం చేసిన ఇంజనీరింగ్‌ డిగ్రీలను రద్దు చేస్తూ జస్టిస్‌ ఏకే గోయల్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. 
 
అయితే డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ (దూరవిద్య) ద్వారా కోర్సు పూర్తిచేసిన 2001-05 బ్యాచ్‌ విద్యార్థులు.. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్వహించే పరీక్షకు హాజరై డిగ్రీలు పొందవచ్చని స్పష్టంచేసింది. మిగతా బ్యాచ్‌ల విద్యార్థుల డిగ్రీలను మాత్రం రద్దుచేసింది. ఆ కాలానికి సదరు డీమ్డ్‌ వర్సిటీలు ఆ కోర్సు కోసం ఎలాంటి అనుమతులూ తీసుకోకపోవడమే దీనికి కారణంగా పేర్కొంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

కెరీర్

news

‘సమాచార కమిషనర్ల’ నియమాక దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషనర్ల నియమానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును మరో ...

news

దసరా నుంచి జియో ఫీచర్ ఫోన్లు పంపిణీ...

రిలయన్స్ జియో ఉచితంగా అందజేయనున్న ఫీచర్ ఫోన్ల పంపిణీకి దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీకారం ...

news

చెన్నై ఎస్ఆర్ఎంలో జపాన్ ఎడ్యు ఫెయిర్.. ఉన్నత విద్యావకాశాలపై....

తమ దేశంలో ఉన్నత విద్యావకాశాలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జపాన్ దేశ విద్యాశాఖ ...

news

తమిళనాడు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉత్తీర్ణత '0' శాతం : 8 కాలేజీల్లోనే 90 శాతం ఉత్తీర్ణత

తమిళనాడు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఇవన్నీ దేశంలో ...

Widgets Magazine