శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (22:09 IST)

జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలు వాయిదా.. సెప్టెంబర్‌లో మొదలు

జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలను వాయిదా పడ్డాయి. ఇంతా కొత్త తేదీలను కూడా కేంద్ర మానవ వనరుల మంత్రి ఫోక్రియాల్ ప్రకటించారు. సెప్టెంబర్ 1-6 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించనుండగా, సెప్టెంబరు 27న జేఈఈ అడ్వాన్స్, సెప్టెంబరు 13న నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల బృందం సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోక్రియాల్ తెలిపారు. జేఈఈ మెయిన్, నీట్ 2020 పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ రావడంతో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పరిశీలించడం జరిగిందన్నారు. 
 
ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ వినీత్ జోషీతో కూడిన నిపుణుల కమిటీ ఆధారంగా సెప్టెంబర్‌కు జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయడం జరిగిందని మంత్రి పోఖ్రియాల్ తెలిపారు.