దేశంలో ఆరు లక్షలు.. అమెరికాలో ఒక్క రోజే 50వేల కేసులు  
                                       
                  
                  				  అమెరికాలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. తాజాగా కరోనా కేసుల విషయంలో అమెరికా కొత్త రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే అమెరికాలో సుమారు 50వేల కేసులు నమోదైనాయి. ఈ విషయాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. దీంతో అమెరికాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 26,85,806కు చేరింది. వీటిల్లో 1,28,061 మంది మృత్యువాత పడ్డారు. 
				  											
																													
									  
	 
	ఇక ప్రపంచ వ్యాప్తంగా 1,06,67,217 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 5,15,600 దాటింది. అమెరికా తర్వాత అత్యధిక కేసుల జాబితాలో బ్రెజిల్ 14,48,753, రష్యా 6,53,479, భారత్ 5,85,493, యూకే 3,14,992 ఉన్నాయి.
				  
	 
	ఇక మన దేశంలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 19148 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటిపోయింది. మొత్తంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 604641కి చేరింది.
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఇక కరోనా నుంచి కోలుకున్న వారి 359859కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా చనిపోయిన సంఖ్య 434గా నమోదైంది. దీంతో దేశంలో కరోనా బారిన పడి కన్నుమూసిన వారి సంఖ్య 17834కు చేరింది.