Widgets Magazine

ఎంబీఏ చదివి దొంగతనం చేస్తావా? సిగ్గు లేదూ... ఆ డబ్బు, నగలు అక్కడ పెట్టేయ్... భార్య

బుధవారం, 13 జూన్ 2018 (15:25 IST)

Widgets Magazine

దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతోంది. చదువుకున్న యువత జీవనోపాధి లేకుండా చివరికి దొంగతనం వృత్తిగా మార్చుకుంటున్నారు. తాజాగా చెన్నైలో ఎంబీఏ వరకు చదివిన ఇళవది ఉద్యోగం లేక దొంగగా మారాడు. వివరాలలోకి వెళితే చైన్నై తిరువికనగర్ ప్రభు వీధికి చెందిన అరివళగన్ కుటుంబంతో పాటు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పటికే తలుపులు తెరిచి ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 
crime photo
 
సహాయ కమీషనర్ హరికుమార్ ఆధ్వర్యంలో సీఐ రమణి, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే బీరువాలో ఉన్న 12 సవర్ల బంగారు నగలు కనిపించకపోగా, రూ.70 వేలు మాత్రం అలాగే ఉండటంతో అరివళగన్‌కి తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. అక్కడే అద్దెకు ఉంటున్న వారిని కూడా పోలీసులు విచారించారు. తూత్తుకుడి జిల్లా ఉడన్‌కుడికి చెందిన ఇళమదిని విచారించడంతో, ఆ చోరీకి పాల్పడింది తానే అంటూ అంగీకరించాడు. 
 
మూడు నెలల ముందు అరివళగన్ ఇంటిలో అద్దెకు దిగాడు. ఇంటి యజమాని విలాసవంతమైన జీవితాన్ని చూసి అతని ఇంట్లో దొంగతనం చేయాలని పథకాన్ని రచించాడు. పథకం ప్రకారం మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నగలను చోరీ చేసి తన భార్యకు ఇచ్చాడు. అతడు చేసిన పనికి భార్య షాక్ అయ్యింది. ఎంబీఎ చదివి దొంగతనం చేస్తావా... సిగ్గు లేదూ... అంటూ మందలించి వాటిని తీసిన చోటనే పెట్టమని చెప్పేసింది. దాంతో వాటిని అక్కడే పెట్టడానికి వెళ్లాడు. ఆ లోపు అరివళగన్ ఇంటికి తిరిగి రావడంతో కాజేసిన నగలను ఓ బంధువు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. అయితే అరివళగన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆరు గంటలలోపు ఇళమదిని అరెస్టు చేసి, నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Husband Committed Robbery Wife Angry Chennai Crime

Loading comments ...

తెలుగు వార్తలు

news

అద్వానీనీ మోదీ ఎలా అవమానించారో ఈ వీడియోలో చూడండి.. రాహుల్ గాంధీ

బీజేపీ సీనియర్‌ నేత ఎల్కే అద్వానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవం ఇవ్వట్లేదని ఏఐసీసీ ...

news

మిస్టర్ కిమ్... నా కారు చూడు... ట్రంప్ కళ్ల సైగతో...

నిన్నటిదాకా సై అంటే సై అన్న కిమ్, ట్రంప్‌లు ఇద్దరూ సింగపూర్ భేటీ సందర్భంగా కెపెల్లా ...

news

షకీలా 250వ సినిమా.. ''శీలవతి'' అనే పేరు పెట్టకూడదా? ఎందుకండీ?

అడల్ట్ మూవీ స్టార్ షకీలా తన 250వ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమాకు ...

news

తిరుమల వెంకన్న భక్తులకు ఓ శుభవార్త.. రూ.4వేలు చెల్లిస్తే?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఓ శుభవార్త. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చినా శ్రీవారి ...