శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (06:08 IST)

ఎమ్మెల్యేల చుట్టూ 600 మంది పోలీసులు: 20వేల పోలీసుల మోహరింపు

ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం తమిళనాడు నిరువుగప్పిన నిప్పులా ఉంది. మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్‌ బాంబును తలపిస్తోంది. శశికళపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే తమిళనాడులో శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని కేంద్రం

ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం తమిళనాడు నిరువుగప్పిన నిప్పులా ఉంది. మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్‌ బాంబును తలపిస్తోంది. శశికళపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే తమిళనాడులో శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని కేంద్రం అనుమానిస్తోంది. అందుకే భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. 
 
రాష్ట్రమంతటా 20 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రత్యేకంగా శశికళ, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మకాం వేసిన రిసార్టు చుట్టూ ఏకంగా 25 వాహనాలను, 600 మంది పోలీసులు కమ్ముకొని సిద్ధంగా ఉన్నారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అడ్డుకోవడానికి అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నైలో, జిల్లా కేంద్రాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.
 
సుప్రీంకోర్టు శశికళకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించినా, గవర్నర్‌ ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా ఆమె అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడవచ్చని హోం శాఖ రాష్ట్ర పోలీస్‌ శాఖను హెచ్చరించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాధన, డీజీపీ నటరాజన, చెన్నై పోలీసు కమిషనర్‌ జార్జ్‌ తదితరులు సమాలోచనలు జరిపారు. 
 
ముందుజాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు 750 మంది రౌడీలను అదుపులోకి తీసుకున్నారు. శశికళకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అనుకూలంగా తీర్పు వస్తే.. ఈ రెండు అంశాలే తమిళనాడు శాంతిభద్రతలను తేల్చేసే ప్రమాణాలుగా ఉంటున్నాయి.