శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (02:14 IST)

అల్లర్లు జరిగే అవకాశం.. తమిళనాడులో హైటెన్షన్.. ఇంటెలిజెన్స్ ఐజీ బదిలీ

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం, శశికళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కల

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం, శశికళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారె వరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ హోం శాఖ కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి శాంతి భద్రతల అంశాన్ని సమీక్షించారు. ఈ సమావేశం ముగిసిన రెండు గంటలకే ఇంటెలిజెన్స్‌ ఐజీ కె.ఎన్‌.సత్యమూర్తిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో పోలీస్‌ వెల్ఫేర్‌ ఐజీ డేవిడ్‌సన్‌ దేవాశీర్వాదంను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
 
ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంతి పన్నీర్‌ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్‌ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా... శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు. వెయ్యిమంది పన్నీర్‌సెల్వంలను చూశానంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్‌ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది.