శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By CVR
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2014 (17:27 IST)

పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తినడం లేదా... పొంచి ఉన్న టైప్-2 డయాబెటిస్.. జాగ్రత్త

స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లలు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తినేందుకు ఇష్టపడరు. బ్రేక్ ఫాస్ట్ పేరు చెబితే పిల్లలు ఆమడదూరం పరిగెడతారు. కానీ తల్లిదండ్రులు క్రమం తప్పకుండా నిత్యం పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ పెట్టాలి. అందులో ఆరోగ్యానికి మేలు చేసే పీచుపదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. 
 
బలవర్ధకమైన బ్రేక్ ఫాస్ట్‌ను పిల్లలకు పెట్టడం వలన వారికి భవిష్యత్‌లో టైప్-2 డయాబెటిస్ ఏర్పడే అవకాశం చాలా తక్కువని లండన్‌లోని సెయింట్ జార్జ్ యూనివర్సిటీకి చెందిన యాంజేలా డొనిన్ అనే శాస్త్రవేత్త చేసిన అధ్యాయనం ద్వారా వెల్లడైంది. 
 
బ్రిటన్‌లోని 9-10 సంవత్సరాల లోపు ప్రైమరీ స్కూలు విద్యార్థులపై ఈ స్టడీ చేయగా, అందులో పిల్లలు నిత్యం బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా? అయితే ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారు? వీరిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఏమేర ఉన్నాయి వంటి విషయాలను అధ్యయనకారులు పరిశీలించారు. 
 
ఈ పరిశోధన కింద మొత్తం నాలుగు వేల మందికి పైగా పిల్లలను పరిశీలించగా వారిలో 26 శాతం మంది బ్రేక్ ఫాస్ట్‌ను సరిగా తీసుకోవడం లేదని, తరచూ మానేస్తుంటామని చెప్పారు. ఈ పిల్లలకు చేసిన రక్త పరీక్షల్లో వీరు భవిష్యత్‌లో టైప్ - 2 డయాబెటిస్‌ బారినపడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలిసింది.