శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (19:14 IST)

2 ఏళ్లలోలనే పిల్లలకు బలవంతంగా చదివిస్తున్నారా?

పిల్లల్ని ఆడుకోనివ్వడంలో ఆంక్షలు పెట్టకుండా.. బలవంతంగా చదివించకుండా వారికి నచ్చే విధంగా పాఠాలు నేర్పించడం ద్వారా వారిపై ప్రతికూల ప్రభావం ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
పిల్లలు ఏదైనా బొమ్మని భాగాలుగా విడదీసి చూస్తుంటే.. బొమ్మని విరగొట్టేశావ్ అని తిట్టకుండా.. అలా పరిశీలించడం కొత్త విషయం తెలుసుకోవాలన్న ఉత్సుకతను తెలియజేస్తుందా అన్న కోణంలో ఆలోచించండి. 
 
తల్లిదండ్రులు రెండున్నరేళ్ల వయసు నుంచే చకచకమని ఏబీసీడీలు, అంకెలూ, రాజధానుల పేర్లు నేర్పిస్తుంటారు. అలా చేయడం వల్ల వాళ్లకి భవిష్యత్తులో చదువంటే వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉంది. 
 
అలాంటివి నేర్పాలనుకుంటే బలవంతంగా పలకా, బలపం ఇచ్చి దిద్దించకుండా.. ఏబీసీడీల ఆకారంలో ఉండే బొమ్మల్లాంటివి తెచ్చి ఇంట్లో భాగంగా నేర్పండి.