శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 నవంబరు 2014 (17:53 IST)

చిన్నారుల్లో అల్లరి.. మాటలను హద్దుల్లో పెట్టండి!

చిన్నారుల అల్లరి.. మాటలను హద్దుల్లో పెట్టండి! లేకుంటే పెరిగిన తర్వాతే బాధేనని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. కొందరు పిల్లలు వయసుకి మించి మాటలు చెబుతుంటారు. మరికొందరేమో పెద్దా చిన్నా లేకుండా మాటకు మాట ఎదిరించి మాట్లాడతారు. 
 
మరికొందరు చిన్నారులు వారి మాటే నెగ్గాలంటూ మంకు పట్టుకు దిగుతారు. ఇవన్నీ తల్లిదండ్రుల్ని కలవరపెట్టేవే. వీటిని త్వరగా అదుపు చేయకపోతే చిక్కులు తప్పకపోవచ్చు. 
 
మాటలు వస్తున్న సయంలో పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు చిన్నపిల్లలే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. తల్లిదండ్రులను అనుకరించే పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. అందుచేత తెలిసీ తెలియనీ ఊహలతోనో కొడతా, దెబ్బలు పడతాయ్ వంటి పదాలను తక్కువగా వాడేలా చూడండి లేకుంటే స్కూలుకు వెళితే ఇదే పద్ధతి పునరావృతం కావచ్చు. 
 
అలాగే స్కూలులో పిల్లలతో కలిసేటప్పుడు నేర్చుకునే మాటలు సరిగ్గా ఉంటే పర్వాలేదు కానీ కొత్త పదాలు పలికితే.. అవి అభ్యంతర కరంగా ఉంటే ఆ పదాలు వాడొద్దని చెప్పండి. కోపంగా కాకుండా సున్నితంగా ఆ పదాల వాడాకాన్ని నిరోధించండి.
 
పిల్లలపై ముద్దు, గారాబం చేయొచ్చు కానీ హద్దులు దాటినప్పుడు పిల్లల్లో మంకుతనం పెరిగిపోతుంది. ఇది ఇంటి వరకే పరిమితం కాకుండా, నలుగురి ఉన్నప్పుడూ, ఇతల పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు హద్దులు మీరితే ప్రతికూలత తప్పదు. అందుచేత పిల్లలను హద్దులు దాటనీయకుండా.. సున్నితంగా హ్యాండిల్ చేయాలని చైల్డ్ కేర్ నిపుణులు సూచిస్తున్నారు.