శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (14:34 IST)

ప్రయాణాల్లో పాపాయికి ఫుడ్ సంగతేంటి?

ప్రయాణాల్లో పాపాయికి ఫుడ్ సంగతేంటి..? ఆలోచించకుండా బయట అమ్మే పదార్థాలను తినిపిస్తే ప్రమాదమే అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. అందుచేత సెరేల్స్‌ని ప్రయాణాలలో బేబీ ఫుడ్‌గా వాడవచ్చు. అవసరాన్ని బట్టి కొన్ని ధాన్యం గింజలను కూడా వండుకుని పాపాయికి పెట్టవచ్చు. ఐస్ ట్రేస్‌లో గడ్డకట్టిన సెరల్‌ను యధావిధిగా వండుకోవచ్చు. 
 
కొంత మంది చిన్నారులు కమర్షియల్ బేబీ ఫుడ్స్‌ని తినడాన్ని ఇష్టపడరు. ఇంట్లో దొరికే ఆహారానికి అలవాటు పడిన వారు ఇటువంటి ఇబ్బందులకు గురిచేస్తారు. అటువంటపుడు కనీసం ఒక మీల్ లోనైనా వారికి పండును గాని, కూరగాయలు గాని ఇస్తే మంచిది. 
 
అందుకే పిల్లలకి మరీ వేడిగా ఉండే ఫుడ్‌కి అలవాటు కాకుండా చూసుకుంటే వారు రూం టెంపరేచర్‌లో ఉన్న ఫుడ్ తినడానికి ఇబ్బంది పెట్టరు. వీటితో పాటు ఫ్రూట్ సలాడ్స్, వెజ్ సలాడ్స్ కూడా తీసుకెళ్లాలి.