గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2015 (19:18 IST)

వేసవిలో హెల్దీ స్నాక్ : ఫ్రూట్ సమోసా!

పండ్లలో పుష్కలమైన పోషకాలున్నాయన్న సంగతి తెలిసిందే. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంది. ఖర్జూరాల్లో ఐరన్ దాగివుంది. ఈ పండ్లతో సమోసా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..  
 
కావలసిన పదార్థాలు:
 
మైదాపిండి - ఒక కప్పు
నెయ్యి (పూర్ణానికి) - ఒక టేబుల్ స్పూన్‌.
అరటిపండు, ఖర్జూరాలు - ఒక కప్పు.
జాజికాయ పొడి - 1/4 టీ స్పూన్‌.
నారింజ లేదా నిమ్మరసం - ఒక టేబుల్ స్పూన్‌.
 
తయారీ విధానం:
పూర్ణానికి ఇచ్చిన వస్తువులన్నింటిని కలిపి పెట్టుకోవాలి. మైదాపిండికి నెయ్యి, నీరు చేర్చి చపాతీలు చేసుకోవాలి. వీటి మధ్యలో పూర్ణం పెట్టి మూసేయాలి. పెనం వేడిచేసి, సమోసాలను వేసి, నేతితో రెండు వైపులా దోరగా వేపాలి. అంతే యమరుచిగా వుండే ఫ్రూట్ సమోసా రెడీ. వీటిని వేడివేడిగా టమోటా సాస్‌తో సర్వ్ చేయండి.