Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రక్తపోటును నియంత్రించే పుచ్చకాయ-పుదీనా స్లాష్ ఎలా చేయాలి?

బుధవారం, 12 ఏప్రియల్ 2017 (14:54 IST)

Widgets Magazine

వేసవిలో పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుచ్చకాయలో తక్కువ కేలరీలు, పీచుతో పాటు పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇది హైపర్ టెన్షన్‌ను దూరం చేస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలను పుచ్చకాయ నయం చేస్తుంది. పుచ్చకాయ రక్తపోటును తగ్గించడంతో పాటు రక్తనాళాలను పెద్దవి చేస్తుంది. 
 
పుచ్చకాయలో ఎల్.. సిట్రులిన్‌తో పాటు అత్యధికంగా ఎ విటమిన్, బీ6, సీ విటమిన్లున్నాయి. పీచుపదార్ధం సమృద్ధిగా వుంది. పొటాషియం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవడం ద్వారా హృద్రోగాలకు దూరం చేసుకోవచ్చు. 
 
పుచ్చకాయ తింటే నేత్రదృష్టి పెరుగుతుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. దాహాన్ని తీరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి పుచ్చకాయను పచ్చిగానే తినడం బోర్ కొడితే అందులో అరకప్పు పుదీనా ఆకులను చేర్చి.. స్లాష్‌ తాగేస్తే యమా టేస్టుగా ఉంటుంది. పుచ్చకాయ పుదీనా స్లాష్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పుచ్చ ముక్కలు - నాలుగు కప్పులు 
పుదీనా ఆకులు - అర కప్పు 
ఐస్ క్యూబ్స్ - అర కప్పు 
తేనే - అర కప్పు 
 
తయారీ విధానం:  
ముందుగా ఐస్ క్యూబ్స్‌ని బ్లెండర్‌లో వేసి, దాని పై మూతను పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పుచ్చ ముక్కలను కూడా ఐస్ ముక్కలతో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆపై పుదీనా ఆకులను కూడా చేర్చి బ్లెండర్‌లో వేసి రుబ్బుకోవాలి. చివరిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే రుచికరమైన పుదీనా పుచ్చ స్లాష్ రెడీ అయినట్లే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Receipe Summer Fiber Pottasium Highper Tension Watermelon Mint Slush

Loading comments ...

వంటకాలు

news

కంటిచూపును మెరుగుపరిచే చేపలతో పకోడీలు చేసేద్దామా?

ఒక పాన్‌ తీసుకుని కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు ...

news

కోడిగుడ్లను, బచ్చలికూరను వేడి చేయకూడదు: చికెన్.. మష్రూమ్స్ కూడా?

కోడిగుడ్లను ఉడికించాక కూర లేదా వేపుడును రెండుమూడుసార్లు వేడిచేయడం ద్వారా అందులోని పోషకాలు ...

news

బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేసే చెరకు రసంతో ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలి..?

చెరకు రసంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చెరకు రసంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ...

news

ఉల్లిపాయలను తరిగేటప్పుడు నోటిలో బ్రెడ్ ముక్కను పెట్టుకుంటే?

నోట్లో బ్రెడ్ ముక్కను పెట్టుకుని ఉల్లిని తరగడం ద్వారా అందులోని విడుదలయ్యే కన్నీళ్లు ...

Widgets Magazine