శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (15:30 IST)

ఆపిల్ కట్ చేసినపుడు రంగు మారుతుందా..?

సాధారణంగా పండ్లు చూడడానికి ఎంతో ఆకర్షిణీయంగా, తాజాగా ఉంటాయి. కానీ, వాటిని కట్ చేసినప్పుడు రంగు మారిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..
 
యాపిల్ పండును కోసినప్పుడు స్పూత్‌గా ఉంటుంది. కానీ, కాసేటి తరువాత చూస్తే రంగు మారిపోతుంది. కేవలం యాపిల్ మాత్రమే కాదు.. మరికొన్ని పండ్లతో కూడా ఇదే సమస్య. ఆక్సిడేషన్ ప్రక్రియ వలన పండ్లు ఈ విధంగా రంగు మారిపోతాయి. 
 
కుళాయిని విప్పి.. నీటి మధ్యలో పండ్లను ఉంచి కోసినట్లయితే ఆక్సిడేషన్ ప్రక్రియను ఆపవచ్చు. ఇలా చేయడం వలన పండ్లు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి. కట్ చేసిన ఆపిల్ ముక్కలను అల్లం నీటిలో వేసినట్లయితే రంగు మారకుండా ఉంటాయి. 
 
ఒక బౌల్‌లో అరస్పూన్ ఉప్పు కలిపి అందులో కోసిన పండ్ల ముక్కలను వేయాలి. 2 నిమిషాల పాటు అలానే ఉంచి తీయండి. దీనివలన పండ్లు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనిపిస్తాయి.