శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (14:53 IST)

చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను కలిపి చపాతీలు చేస్తే?

* చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి * చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడుగంటలపాట

* వంటగదిలో చీమలు స్వైరవిహారం చేస్తున్నాయా? ఒక దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచండి.
 
* కూరల్లో మసాలా ఎక్కువైతే? రెండు మూడు టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి మంచి రుచిగా వుంటుంది.
 
* చెక్కతో చేసిన చెంచాలు, గరిటెలు వాసన వేస్తుంటే వాటిని వెనిగర్ కలిపిన నీటిలో ఉంచండి. కొద్ది సేపైన తర్వాత వాడుకోండి. వాసన రావు.
 
* వంట చేసేటప్పుడు చేతులు మరకలు అవుతున్నాయా? ఆలుగడ్డ ముక్కలతో రుద్ది కడుక్కోండి.
 
* గులాబ్ జామ్ తయారు చేసేందుకు పిండి కలిపేటప్పుడు పిండిలో కాస్త పన్నీర్ కలపండి. అవి మృదువుగా రుచిగా ఉంటాయి. 
* గులాబ్ జాంలు చేసే సమయంలో కాసిని జీడిపప్పు కూడా గులాబ్ జామ్‌లు చేసే ఉండలకు కలిపారంటే, అవి మృదువుగా ఉంటాయి. మంచి రుచిగా ఉంటాయి.
 
* చపాతీ పిండిని పాలు లేదా గోరువెచ్చని నీళ్ళు లేదా కాస్త నూనె కలిపి గంటపాటు నానబెడితే చపాతీలు మృదువుగా వస్తాయి.
 
* చపాతి పిండిలో ఉడికిన బంగాళదుంపను బాగా కలిపి, ఆ పిండితో చపాతీలు చేస్తే, చపాతీలు మృదువుగా ఎక్కువసేపు ఉంటాయి
 
* చపాతీలు వత్తేటప్పుడు మధ్యలో కాస్త నూనెవేసి మడతలతో చేసి హాట్ ప్యాక్‌లో ఉంచితే ఆరేడుగంటలపాటు మెత్తగా ఉంటాయి.