శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : సోమవారం, 25 జనవరి 2016 (10:29 IST)

బంగాళాదుంపల్ని వెల్లుల్లితో కలిపి ఉంచితే ఏం జరుగుతుంది?

బంగాళాదుంపల్ని వెల్లుల్లితో కలిపి ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
గోధుమ రవ్వ, మైదా పిండిని ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే త్వరగా పాడుకాకుండా ఉంటాయి.
కాకరకాయ కూర వండేటప్పుడు సోంపు గింజలు, బెల్లం వేస్తే అవి చేదును లాగేస్తాయి. కూర రుచిగా కూడా ఉంటుంది.
పాపడ్‌ వంటి వాటిని వేగించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ పీల్చవు.
బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెల్ని తీసేసి ప్లాస్టిక్‌ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.
ఇడ్లీ, దోసె వంటి వాటిని చేసేందుకు నానబెట్టే బియ్యాన్ని కొద్దిసేపు వేగించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోసె కరకరలాడుతూ వస్తుంది.
పసుపు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే పసుపు డబ్బాలో కొన్ని ఎండు మిర్చి, కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.