శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (13:49 IST)

మిగిలిపోయిన అన్నంతో... వడియాలు తయారీ...

పాఠశాలలు తెరిచారు. ఇప్పుడు పిల్లలకు చిరుతిళ్లు బాగా అవసరం. ఇంటి నుంచి రాగానే తినేందుకు ఏదో ఒకటి కావాలంటూ మారాం చేస్తుంటారు. కనుక వారి కోసం ఏదో ఒకటి చేయాలి. రొటీన్‌గా చేసిపెట్టే వంటకాలతో పాటు మిగిలి పోయిన అన్నంతో వడియాలు కూడా చేసి పెట్టవచ్చు. అవి ఎలా

పాఠశాలలు తెరిచారు. ఇప్పుడు పిల్లలకు చిరుతిళ్లు బాగా అవసరం. ఇంటి నుంచి రాగానే తినేందుకు ఏదో ఒకటి కావాలంటూ మారాం చేస్తుంటారు. కనుక వారి కోసం ఏదో ఒకటి చేయాలి. రొటీన్‌గా చేసిపెట్టే వంటకాలతో పాటు  మిగిలి పోయిన అన్నంతో వడియాలు కూడా చేసి పెట్టవచ్చు. అవి ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
అన్నం - మిగిలినది
జీలకర్ర - సరిపడా
పచ్చిమిర్చి - 3
అల్లం - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని మిక్సీలో రుబ్బాలి. ఆ తరువాత రుబ్బిన మిశ్రమాన్ని వడియాలుగా చేసి 3 లేదా 4 రోజులపాటుగా ఎండబెట్టుకోవాలి. ఆపై వడియాలను తీసి డబ్బాలలో వేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ఇలా చేయడం వలన వడియాలు చాలా రుచిగా ఉంటాయి.