సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (08:43 IST)

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది?

కరోనా వైరస్ బారినపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిసి జాన్సన్ ఆరోగ్య పరిస్థితి ఇపుడు నిలకడగా ఉంది. దీంతో ఆయనను ఐసీయూ వార్డు నుంచి సాధారణ వార్డులోకి మార్చినట్టు సమాచారం. అయితే, ఆయన్ను ఇపుడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలు లేవని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం కాస్త మెరుగవుతున్నప్పటికీ మరికొంతకాలం ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.
 
కాగా, ఆయనలో గత నెలలో ఈ వైరస్ లక్షణాలు కనిపించిన విషయం తెల్సిందే. దీంతో స్వీయ నిర్బంధంలో ఉండి చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆదివారం ఆయనను లండన్‌లోని సెంట్ థామస్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే వ్యాధి తీవ్రత కావడంతో ఆయన్ను ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. 
 
ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చెప్పిన వైద్యులు సాధారణ వార్డుకు తరలించారు. విషయం తెలిసిన యూకే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు యూకేలో 66,077 కేసులు నమోదు కాగా, 7,978 మంది మరణించారు. 135 మంది కోలుకున్నారు.