1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి

COVID: ఏపీని తాకిన కరోనా.. భార్యాభర్తలతో పాటు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్

couples
కరోనా ఏపీని కూడా తాకింది. ఏపీలో మూడు కొత్త కరోనా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో ఈ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు వున్నారు. వీరిలో వృద్ధుని పరిస్థితి విషమంగా వుందని.. వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నారు. 
 
గతంలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులతో ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ఐదుకి చేరింది. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ కారణంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో కరోనా వార్డులను ఏర్పాటు చేసింది. 
 
ఇకపోతే దేశంలో మేనెలలో కరోనా కేసులు పెరిగాయి. కేరళ, మహారాష్ట్రలో ఈ కరోనా కేసులు అధికంగా వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ నెల 26నాటికి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.