covid vaccine రెండో డోస్ తీసుకోగానే తల తిరిగి దబ్బుమంటూ కిందపడిపోయాడు, పరీక్షిస్తే చనిపోయాడు
కోవిడ్ వ్యాక్సిన్ నమ్మదగినదని చెపుతున్నప్పటికీ అక్కడక్కడ పలు ఆందోళనకర ఘటనలు జరుగుతున్నాయి. కోవిడ్ టీకా తీసుకున్నవారిలో కొందరు... కారణాలు ఏమయినప్పటికీ చనిపోతున్నారు. అది టీకా ప్రభావమేనని బాధిత కుటుంబ సభ్యులు అంటుండగా, దానికి వేరే కారణం అని వైద్యులు అంటున్నారు.
ఇదిలావుంటే తాజాగా కోవిడ్ రెండో దశ టీకా తీసుకున్న ఓ వ్యక్తి మరణించిన ఘటన మహరాష్ట్ర థానే జిల్లీ భీవండిలో చోటుచేసుకుంది. స్థానిక వైద్యుడికి డ్రైవరుగా పనిచేస్తున్న 45 ఏళ్ల సుఖ్దీయో అనే వ్యక్తి మంగళవారం ఉదయం 11 గంటలకు రెండో దశ కోవిడ్ టీకా వేయించుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు టీకా కేంద్రంలోని వెయిటింగ్ హాలులో కూర్చున్నాడు.
అలా కూర్చున్న అతడికి తల తిరుగుతున్నట్లు అనిపించి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. వారు వైద్యులకు చెప్పేలోపే అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సమీపంలో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు చనిపోయాడని ధృవీకరించారు.
ఐతే పోస్టుమార్టమ్ అనంతరం ఆ వ్యక్తి మరణానికి కారణం ఏంటన్నది తెలుస్తుందని ఆరోగ్య కేంద్ర అధికారి వెల్లడించారు. ఐతే కిర్దిట్ కి ఎలాంటి అనారోగ్యం లేదనీ, ఆయన పూర్తి ఆరోగ్యంగా వున్నారని, టీకా వేయించుకునేందుకు ఉదయాన్నే వచ్చారంటూ ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.