శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జులై 2020 (10:28 IST)

శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి కరోనా.. దర్శనాలు ఆపేస్తారా?

క‌రోనా కేసులు తిరుప‌తి కొండ‌ను కుదిపేస్తున్నాయి.. తిరుమ‌ల‌లో ప‌రిస్థితులు రోజురోజుకీ తీవ్రంగా మారుతుండ‌డంతో..
pedda jeeyangar
భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నాల‌ను నిలిపివేసే ఆలోచ‌న‌లో ఉంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ). ఇప్ప‌టికే శ్రీ‌వారి ఆల‌యానికి చెందిన 18 మంది అర్చ‌కుల‌కు క‌రోనా పాజిటివ్‌గా రావ‌డంతో పాటు పెద్ద జియ్యంగార్‌ కూడా క‌రోనా బారిన‌ ప‌డ‌డంతో ద‌ర్శ‌నాలు నిలిపివేయాల‌ని పాల‌క‌మండ‌లి భావిస్తోంది.
 
తాజాగా శ్రీవారి ఆలయ పెద్దజీయర్‌ స్వామికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో స్వామీజీని తిరుపతిలోని పద్మావతి క్వారంటైన్‌కు టీటీడీ అధికారులు తరలించారు. తిరుమలలో కరోనా కేసులు పెరుగుతుండటంతో శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని దేవస్థాన అధికారులు పరిశీలిస్తున్నారు.
 
కాగా.. తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు తిరిగి ప్రారంభించిన త‌ర్వాతే క‌రోనా కేసులు పెరిగాయ‌ని.. టీటీడీ ఉద్యోగులు, స్థానికులు చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌కు వ‌చ్చిన భ‌క్తులు ఎవ్వ‌రూ క‌రోనాబారిన ప‌డ‌క‌పోయినా.. పూజారుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు అనేక‌మంది క‌రోనా బాధితులుగా మారిపోయారు.
 
అర్చ‌కుల‌ను మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ద‌ర్శ‌నాలు కొన‌సాగిస్తే మ‌రిన్ని కేసులు పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని టీటీడీ భావిస్తోంది. దీంతో.. తాత్కాలికంగా ద‌ర్శ‌నాలు నిలిపివేసి.. శ్రీ‌వారికి ఏకాంతంగా పూజాకైంక‌ర్యాలు నిర్వహించాల‌ని టీటీడీ భావిస్తోంది.