శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 మే 2015 (13:00 IST)

సియట్ అత్యుత్తమ క్రికెటర్‌గా రహానే: రోహిత్‌కు ప్రత్యేక అవార్డ్

టీమిండియా బ్యాట్స్‌మెన్ రహానే 2015 సంవత్సరానికి గాను సియట్ అత్యుత్తమ భారత క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. ఇక శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు. 1983లో భారత్‌కు తొలి ప్రపంచ కప్‌ను అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల దేవ్‌కు జీవిత కాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు. 
 
'సియట్' తన 19వ వార్షికోత్సవ అవార్డుల కార్యక్రమం ముంబైలో సోమవారం జరిగింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై 41 పరుగులు తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌లో రెండోసారి ఛాంపియన్‌గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మకు, గత ఏడాది కోల్‌కత్తాలో శ్రీలంకపై వన్డేల్లో 264 పరుగులు సాధించినందుకు గాను ప్రత్యేక అవార్డుని ప్రకటించారు. 
 
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మ సాధించిన రెండో డబుల్ సెంచరీ ఇదే కావడం గమనార్హం. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మనే కావడం విశేషం.