శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 జులై 2015 (19:12 IST)

కెప్టెన్సీ ఈజీగా లభిస్తుంది.. రహానే టాలెంటేందో చూద్దాం: అగార్కర్

టీమిండియా కెప్టెన్సీ పగ్గాలను ముంబై క్రికెటర్ అజ్యింకా రహానేకు అప్పగించడంపై మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం భారత్ క్రికెట్ పరిణామాలపై కూడా అజిత్ అగార్కర్ తన అభిప్రాయాలను ఓ క్రికెట్ వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ రోజుల్లో భారత క్రికెటర్లకు చాలా సులభంగా కెప్టెన్సీ లభిస్తుందని చెప్పాడు. 
 
సాధారణంగా కెప్టెన్ పదవికి ఎంపికయ్యాడంటే.. ఆ వ్యక్తి ఎంతో గౌరవం, ప్రతిష్ట పొందినట్టే.. కానీ ఓ వ్యక్తికి సులభంగా కెప్టెన్సీ బాధ్యతలు లభిస్తే దాని ప్రాముఖ్యతను కోల్పోయినట్టేనని అగార్కర్ అభిప్రాయపడ్డాడు. 
 
రహానేకు టీమిండియా కెప్టెన్సీ దక్కడంపై అగార్కర్ మాట్లాడుతూ.. "అతడు మృదుస్వభావి. కెప్టెన్‌గా అపార అనుభవం లేకపోయినా.. తానెంత వ్యూహచతురుడో నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశం అన్నాడు. ఇంకా రహానే కెప్టెన్‌గా తన బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తాడో చూడాలని, జింబాబ్వే జట్టును తేలిగ్గా తీసుకోకూడదని టీమిండియా క్రికెటర్లకు అగార్కర్ సూచించాడు.