శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (19:00 IST)

ఇంటర్వ్యూ కావాలంటే బట్టలు మార్చుకో: టీవీ యాంకర్‌కు ఆమ్లా షాక్

అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మహిళా టీవీ ప్రజెంటర్కు వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ కెప్టెన్ హషీమ్ ఆమ్లా భారత్‌లో ఓ టీవీ యాంకర్‌కు షాక్ ఇచ్చాడు. ఇస్లాం మత విశ్వాసాలను నిష్టగా ఆచరించే ఆమ్లా ఓ టీవీ యాంకర్‌కు క్లాజ్ పీకినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  
 
సఫారీలతో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్ సందర్భంగా ముంబైలో ఓ టీవీ యాంకర్ ఆమ్లాను ఇంటర్వ్యూకి పిలిచింది. ఆమ్లాను ప్రశ్నించే క్రమంలో సదరు టీవీ యాంకర్ ఉండగా, ఆమెను తేరిపార చూసిన ఆమ్లా.. ఇంటర్వ్యూ కావాలంటే బట్టలు మార్చుకో.. ఒళ్లంతా కప్పి ఉంచే బట్టలు వేసుకుని రావాల్సిందిగా సూచించాడు. దీంతో ఆ టీవీ యాంకర్.. ఆమ్లాను ఇంటర్వ్యూ తీసేందుకు ముందు ధరించిన తన లోనెక్ టాప్, కురచ దుస్తులు మార్చుకోవాల్సిన వచ్చింది. ఆ తర్వాతే ఆమ్లా ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.