శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2016 (09:32 IST)

అశ్విన్‌ అరుదైన రికార్డు.. వందేళ్లలో ఓ బౌలరూ సాధించని స్ట్రైక్ రేట్‌తో అదుర్స్..

భారత్-కివీస్‌ల మధ్య జరిగిన టెస్టులో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో అరుదైన రికార్డును తన

భారత్-కివీస్‌ల మధ్య జరిగిన టెస్టులో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బంతిని అద్భుతంగా తిప్పుతూ.. ప్రత్యర్థులను చిత్తుచేసిన అశ్విన్.. ఇండోర్‌లో న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఏకంగా 13వికెట్లు పడగొట్టి.. కెరీర్‌లోనే ఉత్తమ గణాంకాలు (13/140) నమోదు చేశాడు. 
 
మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన ఈ స్పిన్నర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో చివరి వికెట్‌ రూపంలో ట్రెంట్‌ బౌల్ట్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గత వందేళ్లలో ఏ బౌలర్ సాధించని స్ట్రైక్ రేట్‌ను అశ్విన్ నమోదు చేసుకున్నాడు. 
 
ఇంకా టెస్టుల్లో వంద వికెట్లకు పైగా వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అశ్విన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టెస్టుల్లో అశ్విన్‌ స్ట్రైక్‌ రేట్‌ 49.4 కావడం గమనార్హం. టెస్టుల్లో స్ట్రైక్‌ రేట్‌ పరంగా చూసుకుంటే గత వందేళ్లలో అశ్విన్‌ టాప్‌ స్థానంలో నిలువగా.. అతని తదుపరి స్థానంలో మెక్‌గిల్‌ (ఆస్ట్రేలియా) 54 స్ట్రైక్‌ రేటుతో, ఆ తర్వాతిస్థానంలో మురళీధరన్‌ 55 స్ట్రైక్‌రేటుతో ఉన్నారు.