బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (15:29 IST)

భారత్ - ఆస్ట్రేలియా వన్డే సిరీస్ : 17 నుంచి సమఉజ్జీల సమరం

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. ఈనెల 17వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో ఈ పర్యటన ఆరంభమవుతుంది. వరల్డ్ మాజీ చాంపియన్లుగా ఉన్న భారత్, ఆస్ట్రేలియ

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. ఈనెల 17వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగే తొలి వన్డే మ్యాచ్‌తో ఈ పర్యటన ఆరంభమవుతుంది. వరల్డ్ మాజీ చాంపియన్లుగా ఉన్న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే సిరీస్‌ను సమ ఉజ్జీల సమరంగా భావిస్తున్నారు. ఈనెల 17 నుంచి అక్టోబరు 13వ తేదీవరకు జరుగనుంది. 
 
ఒకవైపు బంగ్లాదేశ్ పర్యటనను ముగించుకుని ఆస్ట్రేలియా భారత్‌కు చేరుకుంటే, శ్రీలంక పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసిన టీమిండియా స్వదేశానికి చేరుకున్నారు. ఈ రెండు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇందుకోసం స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని కంగారూ టీమ్ ఇప్పటికే చెన్నైనగరానికి చేరుకుంది. 
 
ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ఐసీసీ మినీ ప్రపంచకప్ తర్వాత ఇదే అతిపెద్ద సిరీస్‌గా ప్రచారం సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి వన్డేకి ఈనెల 17న చెన్నై చెపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఆ తర్వాత కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా 21న రెండో వన్డే నిర్వహిస్తారు. 24న జరిగే మూడో వన్డేకి ఇండోర్ ఆతిథ్యమిస్తుంది. 28న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, ఆఖరి వన్డే అక్టోబరు ఒకటో తేదీన నాగపూర్‌లోని విదర్భ క్రికెట్ సంఘం స్టేడియంలో జరుగనుంది. ఆ తర్వాత అంటే వన్డే సిరీస్ ముగిసిన ఆరు రోజుల విరామం తర్వాత... ట్వంటీ20 సిరీస్ ఆరంభమవుతుంది. 
 
ఈ టోర్నీ అక్టోబరు 7 నుంచి 13 వరకూ టీ-20 సిరీస్ నిర్వహిస్తారు. అక్టోబరు 7న జార్ఖండ్‌లోని రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తొలి టీ-20 మ్యాచ్ జరుగుతుంది. అక్టోబరు 10న గౌహతీ నెహ్రూ స్టేడియంలో రెండో టీ-20 మ్యాచ్, అక్టోబరు 13న ఆఖరి టీ-20 మ్యాచ్‌ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహిస్తారు. దీంతో ఆస్ట్రేలియా పర్యటన ముగుస్తుంది. ఆ తర్వాత డిసెంబరులో మరోమారు భారత్‌కు వచ్చి టెస్ట్ సిరీస్ అడనుంది.