శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (22:27 IST)

శ్రీలంకలో పర్యటించనున్న పాకిస్థాన్.. పుష్ప లుక్‌లో బాబర్

Babar Azam
పాకిస్థాన్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జూలై 16న, రెండో టెస్టు జూలై 24న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ 11న 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ సందర్భంలో శ్రీలంక పర్యటనకు ముందు పాకిస్థాన్ జట్టు కెప్టెన్ బాబర్ అస్సాం కొత్త లుక్ నెట్టింట విడుదలైంది. 
 
గుండు గీయించుకుని కారులో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాబర్ కొత్త లుక్ చూస్తుంటే పుష్పలోని పోలీస్ ఆఫీసర్‌ బాలాను పోలి వున్నాడు.
 
ఇకపోతే శ్రీలంకపై పాకిస్థాన్ జట్టు ఆటగాళ్ల వివరాలు:- బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ హురైరా, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, నోమన్ అలీ, సల్మాన్ అలీ అఘా, సర్బరాజ్ అహ్మద్, సౌద్ షకీల్, షాహీన్ అఫ్రిది, షాన్ మసూద్