శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (12:45 IST)

పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్: 3-0 తేడాతో వన్డే సిరీస్ కైవసం

వరల్డ్ కప్ వైఫల్యంతో ఉన్న పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. పాకిస్థాన్‌ను మూడు మ్యాచ్‌లలో ఓడించి, 3-0తో వన్డే సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేయడం ద్వారా పుండుపై కారం రాసినట్లయింది. బంగ్లా టైగర్లు తొలిసారిగా ఒక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం, అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కావడంతో ఆ దేశంలో క్రీడాభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి.
 
ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌లో సైతం బంగ్లాదేశ్ రాణించి క్వార్టర్ ఫైనల్స్ పోరాడిన నేపథ్యంలో.. పాక్ పేలవ ప్రదర్శనపై ఆ దేశంలో అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఆటగాళ్ల ఇళ్ల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో, ప్రముఖ ఆటగాళ్ల ఇళ్ల వద్ద బందోబస్తు పెంచినట్టు తెలుస్తోంది. కాగా, ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం నాడు టీ-20 మ్యాచ్ జరగనుంది.