Widgets Magazine

క్రికెట్ ఆడేందుకు వెళ్లారా... హనీమూన్‌కు వెళ్లారా... : నెటిజన్ల ఫైర్

బుధవారం, 8 ఆగస్టు 2018 (15:11 IST)

భారత క్రికెట్ జట్టుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయ సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా గ్రూపు ఫోటో దిగారు. ఈ ఫోటోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే అసలు చిక్కుకు కారణమైంది.
group photo
 
ఈ ఫోటోలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన క్రికెటర్లు ఎక్కడో వెనుక వరుసలో ఉంటే.. భారత సారథి విరాట్ కోహ్లీ భార్య అనుష్క మాత్రం ముందు వరుసలో ఉంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఈ ఫోటోలో 'టీమిండియా వైస్ కెప్టెన్ ఎక్క‌డో వెనుక వ‌ర‌స‌లో ఉంటే.. అనుష్క మాత్రం ముందు ఉంది. టీమిండియాకు అనుష్క ఎప్పుడు ఎంపికైంది. ఇంత‌కీ ఆమె బౌల‌రా? బ్యాట్స్‌మెనా?, ఇది క్రికెట్ టూరా? లేక‌పోతే హనీమూన్ టూరా?, ఇదేమైనా ఫ్యామిలీ ఫంక్ష‌నా? అనుష్క‌కు ఇంత ప్రాధాన్యం ఎందుకు' అంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఇది వైరల్ అయింది. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
ఇండియన్ క్రికెట్ టీమ్ విరాట్ కోహ్లీ అనుష్కశర్మ ట్విట్టర్ ట్రోల్ Bcci Picture Anushka Sharma Twitter Trolls బీసీసీఐ Virat Kohli Indian Cricket Team

Loading comments ...

క్రికెట్

news

ఇంగ్లీష్ మహిళా క్రికెటర్‌తో అర్జున్ టెండూల్కర్ డేటింగా?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్. ఈ బుడతడు తండ్రికి తగ్గ ...

news

సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌.. నో బాల్ వేసిన బౌలర్‌పై విమర్శలే విమర్శలు

సోమర్‌సెట్ క్రికెట్ లీగ్‌లో బ్యాట్స్‌మన్ సెంచరీ చేయకుండా నో బాల్ వేసిన బౌలర్‌పై సోషల్ ...

news

సెహ్వాగ్ ఫైర్.. ఉమ్మడి కుటుంబంలో సంతోషం వుండదా? ఏంటి చెత్త చదువు?

డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చురుగ్గా వున్న సంగతి తెలిసిందే. ...

news

నాకు పాకిస్థాన్‌ వెళ్లాలని వుంది.. సర్కారు సలహా తీసుకుంటున్నా: సునీల్ గవాస్కర్

పాకిస్థాన్‌కు వెళ్లే విషయంలో భారత సర్కారు సలహా తీసుకుంటానని.. టీమిండియా మాజీ కెప్టెన్ ...

Widgets Magazine