Widgets Magazine

"ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉన్నారు"... అనుబంధాలు ఎక్కడ? బిగ్‌ బి ఫోటో వైరల్

మంగళవారం, 10 జులై 2018 (11:45 IST)

దేశ సాంకేతిక రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా మ‌నుషుల మ‌ధ్య బంధాలు, అనుబంధాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రాక్టిక‌ల్‌గా చూపించారు.
amitabh bachchan
 
సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అమితాబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న కొడుకు అభిషేక్ బ‌చ్చ‌న్‌, చిన్నారులు శ్వేతా బచ్చన్ నందా, మనవళ్లు నవ్యా నవెలి నందా, అగస్త్య తదితరులు క‌లిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. అందులో న‌వ్య త‌ప్ప మిగ‌తావారందరూ చేతిలో స్మార్ట్ ఫోన్లు పట్టుకుని వాటిలో లీనమైపోయివున్నారు. 
 
ఈ స‌న్నివేశాన్ని క్లిక్ మ‌నిపించిన బిగ్ బీ, ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. "ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉన్నారు, కానీ వారితో ఫోన్స్ కూడా ఉన్నాయి" అనే కామెంట్ పెట్టారు. ప్ర‌స్తుతం బిగ్ బీ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, నెటిజన్స్ పలు ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఈ ఫోటో పోస్ట్ చేసి 24 గంట‌లు కూడా కాక‌ముందే ఐదున్నర లక్షలకు పైగా లైక్స్ సంపాదించుకుంది.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గ‌జ‌దొంగ‌గా వ‌స్తోన్న‌ స‌ప్త‌గిరి..!

అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించి... ఆ త‌ర్వాత క‌మెడియ‌న్‌గా ఎన్నో ...

news

నయనతార అంత సులువుగా ఒప్పుకుంటుందని ఊహించలేదు.. యోగిబాబు

కమెడియన్ సునీల్‌కు హీరోగా మంచి గుర్తింపు నిచ్చిన సినిమా అందాల రాముడు. ఈ సినిమా పేరు ...

news

ఆయ‌న‌కి నేను జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను: రామ్ చ‌ర‌ణ్‌(Video)

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన ...

news

మహేష్... నీ కత్తి మడిచి అక్కడ పెట్టుకో... మాధవీలత సంచలన వ్యాఖ్యలు..

శ్రీరాముడు, సీతమ్మపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పైన సినీతారలు, హిందూ ధార్మిక ...

Widgets Magazine