శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (09:43 IST)

పాకిస్థాన్‌తో సిరీస్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు: బాయ్‌కాట్

పాకిస్థాన్‌తో సిరీస్ ఆడకపోవడం వల్ల భారత్‌కు వచ్చిన నష్టమేమీ లేదని ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత జెఫ్రీ బాయ్ కాట్ చెప్పారు. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బీసీసీఐ పాకిస్థాన్‌తో సిరీస్‌కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భారత్‌లో ఆడిన బోర్డులు భారీగా లబ్ధి పొందుతాయని, ఆదాయం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. భారత్‌లో క్రికెట్‌కు లభించే ఆదరణను దేనితోనూ పోల్చలేమని పేర్కొన్నారు. 
 
కాగా, టీమిండియా, పాకిస్థాన్ సిరీస్‌పై ఈ నెల 27న అధికారిక ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో జెఫ్రీ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతుంది. కాగా, యూఈఏలో ఆడాలని పాక్ ప్రతిపాదించగా బీసీసీఐ ఒప్పుకోలేదు. భారత్‌లో ఆడాలన్న బీసీసీఐ నిర్ణయాన్ని పీసీబీ వ్యతిరేకించింది. దీంతో రెండు బోర్డులు సుదీర్ఘ చర్చల నేపథ్యంలో శ్రీలంకలో సిరీస్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే.