శుక్రవారం, 28 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (11:29 IST)

బ్రెట్ లీ దంగల్.. కుస్తీ పడ్డాడు.. (వీడియో)

అమీర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా 'దంగల్' దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. చైనాలో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'దంగల్' ప్రస్తుతం హాంకాంగ్‌లోనూ అదరగొడుతోంది. స్వదేశంలో 'బాహుబలి-2' కలెక్షన్లకు ఆమడ దూరంలో నిలిచిన

అమీర్ ఖాన్ స్పోర్ట్స్ డ్రామా 'దంగల్' దూకుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. చైనాలో కలెక్షన్ల సునామీ సృష్టించిన 'దంగల్' ప్రస్తుతం హాంకాంగ్‌లోనూ అదరగొడుతోంది. స్వదేశంలో 'బాహుబలి-2' కలెక్షన్లకు ఆమడ దూరంలో నిలిచిన 'దంగల్' ఎప్పుడైతే చైనాలో విడుదలైందో ఆ తర్వాత రాజమౌళి చిత్రరాజాన్ని కలెక్షన్ల విషయంలో పక్కకు నెట్టేసింది. తాజాగా దంగల్ స్ఫూర్తితో ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌లీ కుస్తీపట్టాడు. 
 
భారత దేశాన్ని ఎక్కువ అభిమానించే  బ్రెట్‌లీ.. పదునైన బంతులు విసిరి ప్రత్యర్థులను వణికించాడు. తాజాగా కుస్తీపట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌లో బ్రెట్‌లీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. మ్యాచ్‌ల మధ్య విరామం దొరకడంతో కుస్తీ సాధన కేంద్రానికి వెళ్లాడు. అక్కడ కుస్తీ నేర్చుకుంటున్న వారితో సరదాగా గడిపాడు. వారితో కలిసి కసరత్తులు కూడా చేశాడు. దీనికి సంబంధించిన విషయాలు ప్రస్తుత సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.