Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్ కుక్క - బంగ్లాదేశ్ పులి : సగటు భారతీయుడి రక్తం మరిగేలా చేసిన బంగ్లా ఫ్యాన్స్‌ వక్రబుద్ధి!

గురువారం, 15 జూన్ 2017 (09:10 IST)

Widgets Magazine
india - bangla flag

బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ మరోమారు తమలోని వక్రబుద్ధిని బయటపెట్టారు. భారత్‌ను కుక్కతోనూ, బంగ్లాదేశ్‌ను పులితోనూ పోల్చారు. కుక్కను పులి వెంటాడుతున్నట్టు పోస్టర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంగ్లండ్ వేదిగా జరుగుతున్న ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో భాగంగా, భారత్, బంగ్లాదేశ్‌లు రెండో సమీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ అత్యుత్సాన్ని ప్రదర్శిస్తూ భారత జాతీయ పతాకాన్ని అవమానించారు. 
 
భారత్‌ను కుక్కతో పోల్చుతూ సోషల్‌ మీడియాలో ఫొటో పోస్ట్‌ చేశాడు సిఫాత్‌ అబ్దుల్లా అనే బంగ్లా అభిమాని. బంగ్లా జాతీయ పతాకంతో ఉన్న పులి.. భారత త్రివర్ణంతో ఉన్న కుక్కను వేటాడుతున్నట్టు ఫొటో మార్ఫింగ్‌ చేసి సగటు భారతీయుడి రక్తం మరిగేలా చేశాడు. పైగా.. "సోదరులారా.. ఇది మంచి పోరు కానుంది" అని క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన భారత నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ సెమీస్‌లో బంగ్లాను చిత్తు చేసి ఆ దేశానికి గట్టి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు.
 
గతంలో ఆసియా కప్‌లో బంగ్లా ఫైనల్‌కు చేరినప్పుడు.. 2015లో ఆ జట్టు భారత్‌ను ఓడించినప్పుడు ఆ దేశ అభిమానులు ఇలాగే శ్రుతిమించారు. వీటిపై అప్పట్లో దీనిపై పెద్ద చర్చే జరిగింది. మళ్లీ బంగ్లాదేశ్‌కి చెందిన ఓ అభిమాని సోషల్‌మీడియాలో పంచుకున్న ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. గురువారం సెమీఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాకు భారత్ దెబ్బ ఎంటో చూపించాలని సోషల్‌మీడియా ద్వారా భారత అభిమానులు కోరుకుంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

యువరాజ్ బాధపడొద్దు.. కోట్లమందిమి నీతోనే ఉన్నాం.. కలకాలం జీవించు.. అభిమానుల నీరాజనం

తన క్రికెట్ కెరీర్లో ఎలాంటి లోటు మిగిలి లేదని, కేన్సర్ వ్యాధికి గురై కూడా ఇంకా బతికి ...

news

ఛాంపియన్స్ ట్రోఫీలో యువీ రికార్డు.. 300వ వన్డే మ్యాచ్ ఆడిన ఆటగాడిగా రికార్డ్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గురువారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో భారత్ ...

news

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నెం.1: విరాట్ ఖాతాలో రూ. 100 కోట్ల డీల్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆట‌గాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రోసారి ...

news

కేన్సర్‌ను జయించి, బంతిని దంచి కొట్టిన యువరాజసం

గోడకు కొట్టిన ప్రతిసారీ అంతే బలంగా వెనుదిరిగి రావడం అతనికి తెలిసినంత బాగా బహుశా సమకాలీన ...

Widgets Magazine