Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహిళా క్రికెట్లో మెరుస్తున్న మణి దీపం స్మృతి మంధన

హైదరాబాద్, మంగళవారం, 4 జులై 2017 (02:55 IST)

Widgets Magazine

భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇటీవల వరల్డ్‌ కప్‌లో సెంచరీ బాదిన ఈ అమ్మాయిని భారత లెజండ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ప్రశంసల్లో ముంచెత్తారు.. స్మృతి చిన్నప్పుడు తన ఫేవరెట్‌ క్రికెటర్‌ కుమార సంగక్కరను తెగ కాపీ కొట్టేదట. అతని ప్రతి బ్యాటింగ్‌ స్టైల్‌ను నకలు చేసేందుకు ఆమె ప్రయత్నించడంతో కోచ్‌ కొన్నిసార్లు తలంటాల్సి వచ్చిందట. 
 
ఈ విషయాన్ని ఆమె చిన్ననాటి కోచ్‌ అనంత్‌ తంబ్వేకర్‌ తెలిపారు. స్మృతికి చిన్నప్పుడే క్రికెట్‌ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో తన సోదరులతో కలిసి ఆమె కూడా అనంత్‌ తంబ్వేకర్‌ కోచింగ్‌ అకాడమీలో చేరింది. 'స్మృతి చిన్నప్పటినుంచి చాలా హుషారుగా ఉండేది. అదేసమయంలో నెట్స్‌లో మాత్రం చాలా క్రమశిక్షణతో మెలిగేది. ఒక షాట్‌ ఆడటంలో కచ్చితత్వం సాధించేవరకు ఆమె నెట్స్‌ను వదిలిపెట్టేది కాదు. నెట్స్‌లో తను ఎప్పుడూ శ్రీలంక బ్యాట్స్‌మన్‌ సంగక్కరను కాపీ కొట్టడానికి ప్రయత్నించేది. దీంతో కొన్నిసార్లు నేను ఆమెను తిట్టేవాడిని. అలా కాపీ కొట్టడం సరికాదని చెప్పేవాడిని' అని అనంత్‌ తెలిపారు. 
 
20 ఏళ్ల స్మృతి వరల్డ్‌ కప్‌లో భాగంగా గత గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

కోహ్లీని మించిపోతున్న రహానే.. భవిష్యత్ కెప్టెన్ అతడేనా.. స్మిత్ మాటలే నిజమయ్యేనా?

టీమిండియా తరపున ఎన్ని మ్యాచ్‌లు ఆడినా రాని గుర్తింపు ఒక విదేశీ కెప్టెన్ ఆత్మీయ ప్రశంసలతో ...

news

ధోనీని ఇలా ఎన్నడైనా చూశామా? ‘ఎక్స్‌పైరీ డేట్‌’కు చేరువైనట్లేనా?

ఓటమి తప్పదనిపించిన మ్యాచ్‌లను విజయాలతో ముగించడంతో అల్లుకుపోయిన పేరు తనది. అతనుంటే చాలు ...

news

సచిన్ - ద్రవిడ్ రికార్డులకు అడుగు దూరంలో అజింక్యా రహానే

భారత క్రికెట్ లెజెండ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను సమం చేసేందుకు ఓ ...

news

వాళ్లు పాకిస్థాన్‌ను చిత్తు చేశారు... వీరు వెస్టిండీస్‌ చేతిలో ఓడారు

భారత క్రికెట్‌ అభిమానులకు ఒక శుభవార్త.. మరొకటి అశుభవార్త. భారత మహిళా క్రికెట్ జట్టు ...

Widgets Magazine