శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (14:30 IST)

బంధువులు, స్నేహితురాళ్లను వివాహం చేసున్న క్రికెటర్లు ఎవరు?

అంతర్జాతీయ క్రికెట్‌లో పలువురు క్రికెటర్లు తమ బంధువులను, చిన్ననాటి స్నేహితులను వివాహం చేసుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో పలువురు క్రికెటర్లు తమ బంధువులను, చిన్ననాటి స్నేహితులను వివాహం చేసుకున్నారు. అలాంటి వారిలో భారత క్రికెటర్లు, పాకిస్థాన్, శ్రీలంక క్రికెటర్లు అధికంగా ఉన్నారు. అలాంటి వారెవరో ఓ సారి పరిశీలిద్ధాం.
 
వీరేంద్ర సెహ్వాగ్... 
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ 12 సంవత్సరాల క్రితం ఆర్తీ అహ్లావత్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సెహ్వాగ్‌ కుటుంబానికి దగ్గరి బంధువు అయిన ఆర్తీ.. వివాహానికి ముందే సుమారుగా మూడేళ్లుగా కలిసిమెలిసి తిరిగారు.
 
సయీద్ అన్వర్... 
పాకిస్థాన్ క్రికెటర్ అయిన సయీద్ అన్వర్... తన కజిన్ అయిన లుబ్నాను 1996 మార్చిలో వివాహం చేసుకున్నాడు. ఈమె వైద్యురాలు.
 
మురళీ విజయ్...
మురళీ విజయ్ తన బాల్య స్నేహితురాలైన నిఖితను వివాహం చేసుకున్నాడు. 
 
షాహిద్ ఆఫ్రిది..
పాకిస్థాన్ క్రికెటర్ అయిన షాహిద్ ఆఫ్రిది నదియా ఆఫ్రిదిని వివాహం చేసుకున్నాడు. ఈమె తన సమీప పంధువుల అమ్మాయి. 
 
ఉపుల్ తరంగా... 
శ్రీలంకకు చెందిన ఉపుల్ తరంగా కూడా తన స్నేహితురాలిగా ఉన్న నిలంకా తరంగాను పెళ్లి చేసుకున్నాడు.