శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 మే 2015 (17:04 IST)

క్రిస్టియానో రొనాల్డో కొత్త లవ్వాయణం: బికినీ మోడల్‌తో డేటింగ్!

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కొత్త లవ్వాయణం మొదలెట్టాడు. ఈ మధ్యనే సూపర్‌ మోడల్‌ ఇరీనా షిక్‌కు గుడ్ బై చెప్పేసిన రొనాల్డో..  మరో గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఇటాలియన్‌ మోడల్‌, నటి అలెస్సియా టెడెస్సీతో డేటింగ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బికినీ మోడల్‌గా ఆమెకు పేరు ఉంది. చాంపియన్స్‌ లీగ్‌లో రొనాల్డో ఆట చూసేందుకు ఇటలీ నుంచి స్పెయిన్‌ వెళ్లింది.
 
చాంపియన్స్‌ లీగ్‌లో రొనాల్డో రియల్‌ మాడ్రిడ్‌ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు 61 గోల్స్‌తో అదరగొట్టాడు. మియామిలోని ఓ బీచ్‌లో ఇటీవలే జరిగిన బికినీ ఫొటోషూట్‌లో సందర్భంగా అలెసియా అందాన్ని చూసిన రొనాల్డో ముగ్ధుడయ్యాడట. తొలిచూపులోనే ఆమె మనసు దోచేయడంతో ఆ తర్వాత మాట కలిపాడు. అనంతరం ఇద్దరు ఒక్కడై ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.