శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (17:14 IST)

డుప్లెస్‌కు ఐసీసీ జరిమానా.. మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత.. బాల్ ట్యాంపరింగ్ చేశాడు..

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సఫారీలు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌పై ఐసీసీ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడని ఆరోపణలు చేసింది.

ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సఫారీలు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకొన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌పై ఐసీసీ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడని ఆరోపణలు చేసింది. హోబర్ట్‌లో జరిగిన రెండో టెస్టులో డుప్లెసిస్‌ బంతి స్థితిని మార్చాడని, ఐసీసీ నిబంధనావళిలోని 2.2.9వ ఆర్టికల్‌ను అతిక్రమించినట్లు పేర్కొంది. రెండో టెస్టు మ్యాచ్‌ నాలుగో రోజు డుప్లెసిస్‌ నోటిలోని తడి అంటించి బంతిని మెరిసేలా చేశాడు.
 
అప్పుడు అతడి నోట్లో చూయింగ్‌ గమ్‌లాంటి పదార్థం ఉంది. టీవీ రిప్లైలో ఇది స్పష్టంగా కనిపించడంతో అతడిపై బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన డుప్లెస్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో డుప్లెస్‌ ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదులందాయి. దీంతో స్పందించిన ఐసీసీ.. డుప్లెస్‌ మ్యాచ్‌ రుసుంలో 100 శాతం కోత విధించింది.