శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (11:24 IST)

మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్న గౌతం గంభీర్: ఎందుకో?

టీమిండియాలో స్థానం దక్కించుకోవడానికి గౌతమ్ గంభీర్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బ్యాటింగ్ తీరును మెరుగుపరుచుకునేందుకు ఆసీస్‌కు వెళ్లిన గంభీర్ క్రికెట్ దిగ్గజం జస్టిన్ లాంగర్ పర్యవేక్షణలో సాధన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఢిల్లీ క్రికెటర్.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ వంటి కొత్త విద్యలు నేర్చుకుంటున్నాడు. 
 
అయితే గౌతం గంభీర్ వీటిని నేర్చుకోవడం రిలాక్సేషన్ కోసం కాదని, బ్యాటింగ్ టెక్నిక్‌ను పదునుపెట్టుకునేందుకేనని తెలిసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించేందుకే గౌతం గంభీర్ కఠోరంగా ప్రాక్టీస్ చేస్తూ, కొత్త విద్యలను నేర్చుకుంటున్నాడని సమాచారం. 
 
జిమ్నాస్టిక్స్ ద్వారా వ్యక్తుల ఫుట్ వర్క్ మెరుగవ్వడమే గాక, శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం వీలవుతుంది. ఇక, మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్ శరీర కదలికల్లో చురుకుదనానికి తోడ్పడతాయని క్రికెట్ పండితులు అంటున్నారు. ఇందుకే గౌతం గంభీర్ కూడా కొత్త విద్యల్ని నేర్చుకుంటున్నాడని తెలిసింది.