బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (10:20 IST)

క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు?

క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను ఈ కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ క్రికెటర్ త

క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాను ఈ కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ క్రికెటర్ తేరుకున్నాడు. అంబేద్కర్‌ అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయనను కించపరిచే వ్యాఖ్యలు తాను ఎందుకు చేస్తానని అన్నాడు. 
 
తన పేరుతో ఉన్న నకిలీ అకౌంట్‌లో అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దానికీ తనకు ఎటువంటి సంబంధం లేదని పాండ్యా వివరణ ఇచ్చుకున్నాడు. గత డిసెంబర్‌ 26న 'ఏ అంబేడ్కర్‌? దేశాన్ని విభజించే రాజ్యాంగాన్ని తయారుచేసిన వ్యక్తా? లేక దేశంలో రిజర్వేషన్‌ అనే జాఢ్యాన్ని వ్యాప్తి చేసిన అంబేడ్కరా?' అని ఎట్‌ సర్‌హార్దిక్‌3777 అనే ట్విట్టర్‌ ఖాతా నుంచి ట్వీట్‌ రావడం దుమారం రేపింది.