శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2016 (16:55 IST)

బిగ్‌బాష్ టోర్నీలో ఆడే తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా?

ఆస్ట్రేలియాలో జరుగనున్న బిగ్‌బాష్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మహిళల ట్వంటీ-20 పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ థండర్స్ జట్టు కోసం భారత క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రాతి

ఆస్ట్రేలియాలో జరుగనున్న బిగ్‌బాష్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మహిళల ట్వంటీ-20 పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ థండర్స్ జట్టు కోసం భారత క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రాతినిథ్యం వహించనున్నారు. దీన్ని సిడ్నీ జట్టు యాజమాన్యం ధ్రువీకరించింది.

వచ్చే డిసెంబర్-జనవరిలో జరిగే క్రికెట్ సిరీస్‌ల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సిడ్నీ థండర్స్ తరపున బరిలోకి దిగనుంది. తద్వారా విదేశీ గడ్డపై జరిగే స్వదేశీ టోర్నీలో ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు సాధించింది.
 
ఇదిలా ఉంటే మాజీ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డయానా ఎడుల్జి మాట్లాడుతూ..  బీసీసీఐ ఐపీఎల్ లాంటి క్రికెట్ టోర్నీలు మహిళల కోసం నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. భారత మహిళా క్రికెట్‌ను అభివృద్ధి పరిచేందుకు బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక భారత్ తరపున తొలి మహిళా క్రికెటర్ ఆస్ట్రేలియా స్వదేశీ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని తెలిపారు.