Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను చావనైనా చస్తానుగానీ.. ఆ పని మాత్రం చేయను : క్రికెటర్ మహ్మద్ షమీ

శుక్రవారం, 9 మార్చి 2018 (15:47 IST)

Widgets Magazine
shami - jahan

పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ భారత క్రికెటర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ ఆరోపించారు. ఆ తర్వాత భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు. అంతేకాదు అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను క్రికెటర్ షమీ తీవ్రంగా ఖండించారు. 
 
తాను చావనైనా చస్తానుగానీ.. అలాంటి పని ఎప్పుడూ చేయబోనని అతను స్పష్టంచేశాడు. హసీన్, ఆమె కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకుందాం అని చెబుతున్నారు. కానీ ఆమెను ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అని షమీ వాపోయాడు. 
 
కాగా, ఇప్పటికే షమీకి కొందరు మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ వాళ్ల ఫొటోలు, ఫోన్ నంబర్లు కూడా హసీన్ సోషల్ మీడియాలో బయటపెట్టిన విషయం తెలిసిందే. దీంతో షమి బీసీసీఐ కాంట్రాక్టుల్లో స్థానం కోల్పోయాడు. షమీ ప్రస్తుతం భారత ఎ తరపున దేవ్‌ధర్ ట్రోఫీలో ఆడుతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు విజయంలో 5 వికెట్లు తీసుకొని చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, ఉత్తరప్రదేశ్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భార్య హసీన్ జహాన్ ఫిర్యాదు మేరకు అతనితోపాటు సోదరుడిపై రేప్, గృహహింస, హత్యాయత్నం కేసులను పెట్టారు పోలీసులు. అతనిపై ఐపీసీ 307 (హత్యాయత్నం), 498 ఎ (గృహహింస), 506 (నేరపూరిత బెదిరింపు), 328 (విషం ఇచ్చి చంపాలనుకోవడం), 376 (రేప్) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ రేప్ కేసును షమి అన్నపై పెట్టారు. షమి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లినపుడు అతని అన్న తనను రేప్ చేశాడని హసీన్ జహాన్ ఫిర్యాదు చేసింది. ఇందులో కొన్ని కేసులు నాన్ బెయిలబుల్ కాగా.. కొన్నింటిలో పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

షమీ నన్ను చంపి అక్కడ పాతేయమన్నాడు.. కోహ్లీలా పెళ్లిచేసుకోవాలనుకున్నాడు..

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను ...

news

భారత్‌లో మూడో "సిక్సర్ల" వీరుడు సురేష్ రైనా

పొట్టి క్రికెట్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన సురేష్ రైనా మూడో భారతీయ క్రికెటర్‌గా ...

news

మహిళలు పురుషులతో సమానం కాదు.. అంతకంటే ఎక్కువే: కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను కొనియాడుతూ ...

news

నా భర్తకు వివాహేతర సంబంధం ఉంది.. క్రికెటర్ షమీ భార్య

భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మహ్మద్ షమీపై ఆయన భార్య హాసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. ...

Widgets Magazine