శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (13:15 IST)

2012 ఐపీఎల్ తర్వాతే ఇదంతా జరిగింది.. లేకుంటే ఫీల్డింగ్ కష్టమే: కోహ్లీ

ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయడం వల్లే మంచి బ్యాట్స్‌మెన్ నుంచి మంచి ఫీల్డర్‌గా రూపాంతరం చెందానని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. క్రీడాకారులు తప్పకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని.. ఫ

ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేయడం వల్లే మంచి బ్యాట్స్‌మెన్ నుంచి మంచి ఫీల్డర్‌గా రూపాంతరం చెందానని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. క్రీడాకారులు తప్పకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని.. ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఆటలోనూ మెరుగైన ఫలితాలను రాబట్టగలరని కోహ్లీ తెలిపాడు. ఇదే సూత్రమే తన ఆటతీరు మెరుగుపడేందుకు కారణమైందని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కానీ ఇదంతా 2012 ఐపీఎల్ తర్వాతే మొదలైందని అప్పటిదాకా అసలు ఫిట్ నెస్‌ గురించి ఏమాత్రం పట్టించుకునే వాడిని కానని కోహ్లీ వెల్లడించాడు. 2012 ఐపీఎల్‌కు ముందు డైట్ పాటించే వాడిని కానని, వర్కవుట్స్ విషయంలో గానీ శ్రద్ధ పెట్టలేదన్నాడు. ఐపీఎల్ 2012 తర్వాత పద్ధతి ప్రకారం తింటున్నానని.. శరీరాకృతికి పక్కాగా మెయింటైన్ చేస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు.

ఫిట్‌నెస్ గురించి పట్టించుకోకముందు ఫీల్డింగ్ విషయంలో రాణించేవాడిని కాదు.. అయితే ఫిట్‌నెస్, వర్కౌట్స్ గురించి పట్టించుకున్నాక.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మెరుగైన ఫలితాలను రాబట్టగలిగానని కోహ్లీ తెలిపాడు.